OM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from OM, Travel and transport, S1-B/203, SACHIVALAYA NAGAR, VANASTALIPURAM, Hyderabad.

18/03/2024
12/08/2023

Memories 🥰

Om namo Venkatesa 🙏
22/07/2023

Om namo Venkatesa 🙏

Excellent message 👏
22/07/2023

Excellent message 👏

05/07/2023
మన దేశంలో ఉన్న ఏకైక మగ నది ఇదే..! దీని చరిత్ర, ప్రత్యేకత ఏంటో తెలుసా..?ఈ నదిని భారతదేశంలో దేవతగా పూజిస్తారు. పుష్కర్‌లోన...
03/07/2023

మన దేశంలో ఉన్న ఏకైక మగ నది ఇదే..! దీని చరిత్ర, ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఈ నదిని భారతదేశంలో దేవతగా పూజిస్తారు. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ నదిలో స్నానం చేయాలని ఒక నమ్మకం. ఈ నదిలో స్నానం చేయడం వల్ల శారీరక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రహ్మదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఈ నది మరో ప్రత్యేకత ఏమిటంటే..ప్రతి సంవత్సరం జూన్ నెలలో నది నీరు మూడు రోజుల పాటు రక్తంలా ఎర్రగా మారుతుంది.

భారతదేశంలో నదుల చరిత్ర చాలా పురాతనమైనది. నదులు శతాబ్దాలుగా తమ స్వచ్ఛతను కాపాడుకుంటూ నిరంతరం తమ తమ దిశల్లో ప్రవహిస్తున్నాయి. గంగా వంటి పవిత్ర నది గురించి గ్రంథాలు, పురాణాలలో ప్రస్తావించబడింది. భారతదేశంలో ప్రవహించే గంగ, గోదావరి, నర్మద, సింధు, తుంగభద్ర మొదలైన నదులన్నింటికీ స్త్రీల పేర్లు పెట్టారు. ఈ కారణంగానే భారతీయ నదులను స్త్రీలతో పోల్చారు. నదిని తల్లిగా, పవిత్రంగా పూజిస్తారు. నదీస్నానం చేస్తే సకల పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం. అయితే, భారతదేశంలోని ఏకైక పురుష(మగ) నది కూడా ఉంది. అవును ఇది నిజమే. భారతదేశంలోని పురుష నది అత్యంత పురాతనమైనది. అది బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మపుత్ర నది..ఈ నది ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ఆదిత్యనారాయణ...
వేదాలు, పురాణాల ప్రకారం బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి. బ్రహ్మ దేవుడు గొప్ప ఋషి అని నమ్ముతారు. అయితే, శంతనుడి భార్య అమోఘ మహర్షి అందానికి బ్రహ్మ మంత్రముగ్ధుడయ్యాడై, వివాహమాడాడని చరిత్రలో చెబుతారు. బ్రహ్మ అమోఘాలకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడే నీరులా ప్రవహించాడని నమ్ముతారు. బ్రహ్మకు పుట్టిన బిడ్డ కాబట్టి అతనికి బ్రహ్మపుత్ర అని పేరు వచ్చిందనే పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఇకపోతే, భారతదేశంలో ఈ నది పొడవు 2900 కిలోమీటర్లు. ఇది చైనాలోని టిబెట్‌ మానస సరోవరం ఈ నదికి పుట్టినిల్లు. దీనిని టిబెట్‌లో యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు.

మానస సరోవర శ్రేణుల నుంచి ఉద్భవించిన రెండవ నది ఇది. చైనాలో పుట్టిన బ్రహ్మణపుత్ర అరుణచల్ ప్రదేశ్ లో భారత్ లోకి ప్రవేశించింది. అనంతరం అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ దక్షిణం వైపుగా ప్రవహించి జమున నది పేరుతో దిగువ గంగ నదిలో కలుస్తుంది. దీనిని పద్మా నది అని కూడా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది మరోక పాయ మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ నదులు బంగ్లాదేశ్ లోని చాంద్ పూర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదిని భారతదేశంలో దేవతగా పూజిస్తారు. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ నదిలో స్నానం చేయాలని ఒక నమ్మకం. బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయడం వల్ల శారీరక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రహ్మదోషం తొలగిపోతుందని నమ్మకం.

బ్రహ్మపుత్ర నది ప్రత్యేకత ఏమిటంటే..ప్రతి సంవత్సరం జూన్ నెలలో బ్రహ్మపుత్ర నది నీరు మూడు రోజుల పాటు రక్తంలా ఎర్రగా మారుతుంది. బ్రహ్మపుత్ర నది, కామాఖ్య ఆలయానికి ఆనుకొని ఉంది. ఈ మూడు రోజులు కామాఖ్య దేవి తన మాస చక్రంలో ఉంటుందని నమ్ముతారు. ఈ కారణంగా బ్రహ్మపుత్ర నది మూడు రోజుల పాటు రక్తం రంగులోకి మారుతుందని పురాణాలలో చెప్పబడింది. ఈ నదిని హిందువులే కాకుండా జైనులు, బౌద్ధులు కూడా పూజిస్తారు...
--------------------------------------------------------

05/04/2023

దశమహావిద్యలు..
విద్య అంటే సరైన జ్ఞానం మన చుట్టూ ఉన్న మాయను పటాపంచులు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య.జ్ఞాన స్వరూపిని ఆయన శక్తి ధరించిన పదిరూపాలే దశ మహావిద్యలు.
తంత్ర శాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు తొడల తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది..

అజ్ఞానం పాపానికి కారణమోతుంది. పాపం దుఃఖానికి కారణం.జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది.పరమానందాన్ని కలిగిస్తుంది.అటువంటి జ్ఞానాన్ని అమ్మవారి పది అవతారాలలో ప్రసాదిస్తుంది.ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు.జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు?మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, చిన్నమస్త - కాల పరిణామం
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తం
త్రిపుర సుందరి, కమల - ఆనందం, సౌందర్యం
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళం, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి

1.కాళీ రూపాంతరం - కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2.తారా రూపాంతరం - దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3.సుందరీ రూపాంతరం - అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4.భువనేశ్వరీ రూపాంతరం - దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5.భైరవీ రూపాంతరం - దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6.ప్రచండ చండికా రూపాంతరం -దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7.ధూమావతీ రూపాంతరం -దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8.బగళాముఖీ రూపాంతరం - పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9.మాతంగీ రూపాంతరం- మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10.కమలాత్మిక రూపాంతరం - పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది..

శ్రీ మాత్రే నమః ..🙏

26/03/2023

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి.............!!
ప్రతి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారు, శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు.
ఈ సమయమంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇస్టం.

అవి ఆర్ద్రనతకరి అని, అనంత తృతీయ, రసకల్యని అని వ్రతములు చాలా ఇష్టం అని పురాణ వచనం.

ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరమ్.

ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం, వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది.

ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు ఉండవు, రోగ నివారణ, అప్పులు, రుణాలు తీరిపొతాయి అని, కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు.

ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట.

పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు.

కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు.

నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు (దుస్సేర నవరాత్రి), వసంత నవరాత్రులు (ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇస్టం అంటే దేవిభాగవతం లో..
" శ్రీ రామో లలితంబికా, శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే... స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు.

అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏరూపంలో అనుగ్రహిస్తుంది ?
కాలి, చండి, బాల, లలిత, దుర్గ అనేక రూపాలలో ఉండి మనల్ని నడిపిస్తుంది, కరుణిస్తుంది అని అనుమానం..
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది.

మాత్రు రూపం,
శాంతి రూపం,
ఆకలి రూపం లో,
జాతి రూపం లో,
చైతన్య స్వరూపం,
నిద్ర రూపం లో,
దయా రూపం లో,
బుద్ది రూపం లో
కూడా అమ్మవారు ఉండి మనల్ని నడిపిస్తుంది.

అమ్మవారిని ఏమి కోరుకోవాలి...

కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతారు. కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం , క్షణికం . అది తీరగానె మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.

మరి ఏమి కోరాలి ? గురు శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు, నాతో ఉండు" మోక్షం వద్దు, విద్య వద్దు, సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు, నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి, ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి, నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని కోరుకోవాలి.అని అన్నారు.

26/03/2023

Om suryaya namaha 🙏

Maa Mahadevi temple, Jabalpur 🙏
22/03/2023

Maa Mahadevi temple, Jabalpur 🙏

Address

S1-B/203, SACHIVALAYA NAGAR, VANASTALIPURAM
Hyderabad
500070

Telephone

9848254178

Website

Alerts

Be the first to know and let us send you an email when OM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share