08/05/2019
చాలా సంవత్సరాలు గా మన ఊరి వారికి మంచినీటి సమస్య దిన్ని గురించి యువత ముందుకు వచ్చి సమస్యను ఎలా అధిగమించాలి అని పలు ఆలోచనలు చేసి మన దగ్గర ప్రక్క గ్రామం చిట్టవరం లో అవలంబించిన విదానాన్ని గురించి తెలుసుకొని అక్కడి వారి తో చర్చించి, మరియు వారిని మన గ్రామానికి తీసుకువచ్చి మరింత వివరంగా ఇక్కడి వాస్తవ పరిస్తితుల ఆదారంగా మంచినీటి సమస్యను నిర్మూలించడానికి ఒక ప్రాజెక్టు ను రూపొందించి, ఆ వివరాలను (DE (RWS),మన ఊరి కొప్పర్రు పంచాయతీ సెక్రటరీ గార్లకు సమర్పించటం జరిగినది. ప్రాజెక్టు ను చేయడానికి పంచాయితీ నిధులు లేవు అదే విదంగా ప్రభుత్వం నుండి నిధులు ఎప్పటి వస్తాయో తెలియదు అందుచేత మనమే అవసరమయిన నిధులు సేకరించుకొని సంబందిత ప్రభుత్వ అదికారుల అనుమతులతో ఈ ప్రాజెక్టు ను త్వరిత గతిన పూర్తి చేసి మన ఊరి వారికి పరిశుభ్రమయిన మంచినీటి అందించాలని సంకల్పించి మన ఊరి యువత అందరూ ముందుకు వెళ్ళుచున్నాము. సుమారుగా ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 4 లక్షల రూపాయలు వరకు అవుతుంది, ఈ నిధుల సేకరణ కోసం వివిద ప్రాంతాల లో ఉన్న మన ఊరి మిత్రులతో సంప్రదిస్తున్నాము. మన గ్రామ మంచినీటి సమస్యను నిర్మూలించడానికి చేసే ఈ ప్రయత్నానికి అందరూ కలిసి కులాలకు, మతాలకు, వర్గాలకు మరియు పార్టీ లకు అతీతం గా మీ యొక్క పూర్తి సహకారాన్ని అందించాలని విన్నపం 🙏🙏🙏
విరాళం మీ యొక్క ఇస్టాన్ని మరియు పరిస్తితులను బట్టి మీకు వీలు కుదిరినంత ఇవ్వండి, వేరే వారు ఎక్కువ ఇచ్చారు మనం ఇచ్చేది తక్కువగా ఉంది అని ఆలోచించవద్దు, విరాళం ఇవ్వలేకపోఇనా గ్రామం లో ఉండే యువత ముందుకు వచ్చి మన గ్రామ మంచినీటి సమస్యను నిర్మూలించడానికి చేసే ఈ ప్రయత్నానికి మీ సమయాన్ని మరియు వివిద పనులలో మనవారికి అండగా నిలవండి 🙏🙏🙏...గ్రామయువత, కొప్పర్రు...